: ఒక ప్రియుడు, ఇద్దరు ప్రియురాళ్లు... ఒక హత్య


ఇద్దరు ప్రియురాళ్లతో ఒక ప్రియుడు నడిపిన ప్రేమ వ్యవహారం, చివరకు ఒక హత్యతో ముగిసి మరో ఇద్దరిని కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది. ఈ కథలోని ముగ్గురు వ్యక్తులు బాగా చదువుకున్నవారే. కానీ, ఆవేశంలో విచక్షణ కోల్పోవడంతో కథ ట్రాజెడీగా ముగిసింది.

వివరాల్లోకి వెళితే పూణేకు చెందిన నీమేష్ సిన్హా సాఫ్ట్ వేర్ ఇంజినీరైన అనుశ్రీ కుందాను ప్రేమించాడు. కొంత కాలం తర్వాత ఢిల్లీకి చెందిన జూహీ ప్రసాద్ అనే లాయర్ తో అఫైర్ స్టార్ట్ చేశాడు. ముక్కోణపు లవ్ స్టోరీ ఇలా నడుస్తున్న సమయంలో... 2011 నవంబర్ లో ఓ రోజు నీమేష్ తన రెండో ప్రియురాలు జూహీని పూణె రమ్మని పిలిచాడు. దీంతో పూణె వచ్చిన జూహీ నీమేష్ ఫ్లాట్ లో ఒక రోజంతా గడిపింది. మరుసటి రోజు ఉదయం నీమేష్ ఇంటికి వచ్చిన పాత ప్రియురాలు అనుశ్రీ... బెడ్రూమ్ లో నిద్రిస్తున్న జూహీపై పెట్రోలు పోసి నిప్పంటించింది. దీంతో జూహీ ప్రాణాలు కోల్పోయింది.

అయితే, ఈ హత్య పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని... ఇందులో నీమేష్ హస్తం కూడా ఉందని జూహీ తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన కూతుర్ని రక్షించేందుకు నీమేష్ కనీస ప్రయత్నం చేసినా... తన కూతురు కనీసం ప్రాణాలతోనైనా ఉండేదని ఆయన ఆరోపించారు. దీంతో, ఈ హత్యపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా బొంబాయ్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News