: ఇషాంత్ పై సానుభూతి చూపించిన ఫాల్కనర్
మూడో వన్డేలో ఇషాంత్ శర్మకు చుక్కలు చూపించి నమ్మశక్యం కాని రీతిలో ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చిన ఫాల్కనర్ ఇషాంత్ పై సానుభూతి చూపించాడు. "ప్రతి బౌలర్ కు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది... బాధపడకు ఇషాంత్" అని ఫాల్కనర్ అన్నాడు. అంతేకాకుండా, "తీవ్ర ఒత్తిడి ఉండే ఆఖరి ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా కష్టం. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి సందర్భాల్లో బౌలింగ్ చేసి ఇండియాను గెలిపించావు" అని అన్నాడు. ఇషాంత్ వేసిన 47వ ఓవర్లో ఫాల్కనర్ ఏకంగా 30 పరుగులు రాబట్టి భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్ లో కేవలం 29 బంతుల్లో 64 పరుగులు చేసిన ఫాల్కనర్ ఆసీస్ కు అద్భుత విజయాన్ని అందించాడు.