: క్షణ కాలంలో నగల సంచి మాయం


హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో బంగారు ఆభరణాలను అత్యంత చాకచక్యంతో అపహరించారు. భవానీ నగల దుకాణం యజమాని నగల సంచిని పక్కన పెట్టి, షట్టర్ తీస్తుండగా బ్యాగ్ ను దొంగలు ఎత్తుకుపోయారు. క్షణ కాలంలో జరిగిన ఈ సంఘటనతో బాధితుడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. నగల సంచిలో 40 తులాల బంగారం, 12 కిలోల వెండి ఉన్నట్టు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News