: రంగారెడ్డి జిల్లాలో కంపించిన భూమి
రంగారెడ్డి జిల్లా మరపల్లి మండలం దామసపూర్ గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు భూమి కంపించింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. గత కొద్ది రోజుల నుంచి రాత్రి వేళల్లో భూమి లోపల నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం మంత్రి ప్రసాద్ కుమార్, సబ్ కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి... నిపుణులతో తీవ్రతను గుర్తిస్తామని చెప్పారని... కానీ ఇంతవరకు ఎవరూ రాలేదని గ్రామస్తులు వాపోతున్నారు.