: వాగులో కొట్టుకుపోయిన కారు లభ్యం... వ్యక్తుల కోసం గాలింపు


తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో మిర్తిపాడు వాగులో కొట్టుకుపోయిన కారును పోలీసులు గుర్తించారు. కారులోని వ్యక్తులకోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాద స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బొబ్బర్లంక లాకుల వద్ద గాలింపు కార్యక్రమం కొనసాగుతోంది. కారులో విలువైన ఐఫోన్, వాచ్ లు లభ్యమయ్యాయి. కారు రిజిస్ట్రేషన్ నంబరు AP37 TV 4054 అని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News