: సాధువుకి మరో పసిడి కల.. ఈ సారి 2,500 టన్నుల బంగారం
ఈ సాధువు మామూలోడు కాదు సామీ.. అద్భుత, సంచనల విషయాలు బయటపెడుతున్నాడు. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లా దాండియా ఖేరా గ్రామంలో రాజా రాంభక్ష్ సింగ్ కోటలో 1000 టన్నుల బంగారం ఉందంటూ తనకొచ్చిన కలను శోభన్ సర్కార్ బయటపెట్టాడు. మంత్రి గారు ఆయన శిష్యుడు కావడంతో ఆ కల ఆధారంగా భారత భూభౌతిక సర్వే విభాగం అధ్యయనం చేసి భూగర్భంలో లోహాలు ఉన్నాయని తేల్చింది. దాంతో భారత పురావస్తు సర్వే విభాగం శుక్రవారం నుంచీ తవ్వకాలు జరుపుతోంది. అవి నేడూ కొనసాగుతున్నాయి.
ఈ లోపు సాధువు శోభన్ సర్కారుకి మరో కల వచ్చిందట. ఈ సారి 2,500 టన్నుల బంగారం ఉందని. అది కూడా అక్కడే అనుకునేరు. కానే కాదు. ఫతేపూర్ జిల్లా అదంపూర్ గ్రామంలో 2,500 టన్నుల బంగారం దాగుందని ఆయన బయటపెట్టారు. మరి అక్కడ కూడా తవ్వకాలు మొదలవుతాయేమో చూడాలి. సాధువు శోభన్ సర్కార్ సత్యాలే మాట్లాడతారని స్థానికంగా ప్రజలు విశ్వసిస్తారు. ఆయనకు అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు.