: అపోలో ఫార్మసీ నుంచి ఏటా 250 కొత్త స్టోర్లు


ఫార్మసీ (ఔషధాలు) గొలుసుకట్టు రిటైల్ స్టోర్ల నిర్వహణ సంస్థ 'అపోలో ఫార్మసీ' ఏటా కొత్తగా 250 స్టోర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉంది. ఈ విషయాన్ని అపోలో ఫార్మసీ వైస్ ప్రెసిడెంట్ అతుల్ ఆహుజా తెలిపారు. ప్రస్తుతం తమ ఫార్మసీ చైన్ లో 10వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, 1150కోట్ల రూపాయల టర్నోవర్ ఉందని చెప్పారు. ఫ్రాంచైజీ రూపంలో కాకుండా అన్ని స్టోర్లను తామే సొంతంగా నిపుణులైన ఫార్మాసిస్టులతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అపోలో హాస్పిటల్స్ కు అపోలో పార్మసీ అనుబంధ సంస్థ.

  • Loading...

More Telugu News