: సీఎం సహా అందరం సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి పితాని
ముఖ్యమంత్రి కిరణ్ తో పాటు మంత్రులందరమూ సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శాసనసభకు తెలంగాణ తీర్మానం వచ్చిన తర్వాత తామంతా దాన్ని అడ్డుకుంటామని తెలిపారు. కొంత మంది సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిందని వ్యాఖ్యానిస్తున్నారని... ఇది చాలా బాధాకరమని చెప్పారు.