: కేంద్రం తొందరపాటుతో వ్యవహరిస్తోంది: శైలజానాధ్
రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తొందరపాటుతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాధ్ వ్యాఖ్యానించారు. విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన కనీస విధానాలను పక్కన పెట్టి అప్రజాస్వామికంగా వ్యవహరించాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంతంలో ఐదు కోట్ల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చినా పట్టించుకోకుండా ముందుకెళ్లటం సరికాదన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఇలాంటి పరిణామాలు సవాలు చేసే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.