: బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నాకు రూ. 50 లక్షల కుచ్చుటోపీ


మోసపోవడానికి రెడీగా ఉంటే... మోసం చేసేవాడికి సామాన్యుడైనా ఒకటే... హీరో అయినా ఒకటే. ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నాకు ఇప్పుడు ఇదే జరిగింది. కమోడిటీ మార్కెట్లో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే దాన్ని రెండింతలు చేస్తామంటూ... కొంత కాలం కిందట ముంబైలోని ఓ ప్రైవేట్ కంపెనీ అతన్ని సంప్రదించింది. మంచి డీల్ కదాని అక్షయ్ ఖన్నా ముందూ వెనకా ఆలోచించకుండా ఏకంగా రూ. 50 లక్షలు ఇన్వెస్ట్ చేసేశాడు. సీన్ కట్ చేస్తే, పెట్టుబడి రెట్టింపు కాలేదు కదా... మొదటికే మోసం వచ్చింది. కంగుతిన్న అక్షయ్ ఖన్నా ముంబై పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేశాడు. దీంతో, పోలీసులు సదరు సంస్థ ప్రెసిడెంట్, ఆయన భార్యతో పాటు కంపెనీ డైరెక్టర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News