: పోలవరం టెండర్లలో అక్రమాలు జరిగాయి: బీజేపీ


ఇటీవలే ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు పోలవరం టెండర్లు అప్పగించి ఊపిరి పీల్చుకున్న రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రభాకర్ నిప్పులు చెరిగారు. పోలవరం టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అక్రమాలు చేసే సంస్థలకు టెండర్లు కేటాయించడంలో ఔచిత్యమేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇక, బాబ్లీపై సుప్రీం తీర్పుపైనా ఆయన స్పందించారు. బాబ్లీ నిర్మాణం కొనసాగించవచ్చని మహారాష్ట్ర సర్కారుకు సుప్రీం పచ్చ జెండా ఊపడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా సమర్థిస్తుందని ప్రభాకర్ అన్నారు. బాబ్లీ పూర్తయితే తెలంగాణకు శాపంలా పరిణమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News