: హెలికాప్టర్ల కుంభకోణంలో బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర : బీజేపీ


అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర ఉందని బీజేపీ నేత ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్విట్జర్లాండ్ లో అరెస్ట్ చేసిన దళారి హాష్కీని భారత్ రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రదర్ అనిల్ కుమార్ ను, హాష్కీని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తే నిజాలు వెలుగుచూస్తాయని అన్నారు. మత ప్రచారకుడి ముసుగులో బ్రదర్ అనిల్ అనేక చీకటి కార్యకలాపాల్లో పాలుపంచుకున్నాడని ప్రభాకర్ విమర్శించారు.

  • Loading...

More Telugu News