: నరేంద్ర మోడీ సభకు 11 ప్రత్యేక రైళ్లు


రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని హస్తిన పీఠంపై కూర్చుండబెట్టేందుకు నరేంద్ర మోడీ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా భారీ సభలతో ఎన్నికల వేడిని రగిలిస్తూ... ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ ప్రచార పర్వంలో భాగంగా ఈ నెల 27న బీహార్ రాజధాని పాట్నాలో భారీ ర్యాలీకి బీజేపీ శ్రేణులు శ్రీకారం చుట్టాయి. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ అడ్డాలో జరుగుతున్న ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు బీజేపీ సమాయత్తమయింది. ఈ నేపథ్యంలో, సభకు హాజరయ్యే కార్యకర్తలను తరలించేందుకు ఏకంగా 11 ప్రత్యేక రైళ్లను బుక్ చేశారు. అంతేకాకుండా, స్టేజీ వెనుక భాగంలో 30 అడుగుల డైనమిక్ స్క్రీన్ ను ఏర్పాటుచేస్తున్నారు.

  • Loading...

More Telugu News