: ఐరాసలో లంకకు వ్యతిరేకంగా భారత్ తీర్మానించాలి: కరుణానిధి


శ్రీలంక యుద్ధ నేరాల వ్యవహారంలో భారత్.. ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో లంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటెయ్యాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు. తమిళుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్న లంక సర్కారుకు భారత నిర్ణయం చెంపపెట్టు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎల్టీటీఈతో పోరు చివరి దశలో లంక తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందంటూ అమెరికా త్వరలోనే భద్రత మండలిలో తీర్మానం ప్రవేశపెట్టనుంది.

కాగా, యూపీఏ సర్కారుకు అతిపెద్ద భాగస్వామ్య పక్షం అయిన డీఎంకే కొద్దిరోజుల క్రితం 'తాము కావాలో, లంక కావాలో' తేల్చుకోండంటూ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణానిధి మరోసారి గొంతువిప్పారు. 'మేం మళ్లీ అదే చెబుతున్నాం. అలాగే చెబుతుంటాం కూడా. కేంద్రం మా మనోభావాలను అర్థం చేసుకుని నడుచుకుంటుందని భావిస్తున్నాం. మేమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ సమాజం భారత నిర్ణయం పట్ల ఉత్సుకతతో ఉంది' అని కరుణానిధి చెప్పారు. 

  • Loading...

More Telugu News