: స్నేహితురాలితో బలవంతంగా యాసిడ్ తాగించిన కర్కశుడు


ముంబైలో ఒక ఉన్మాద యువకుడు తన స్నేహితురాలితో బలవంతంగా యాసిడ్ తాగించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ముంబైలోని దాహిసర్ ప్రాంతానికి చెందిన 20ఏళ్ల జితేంద్ర, అదే ప్రాంతానికి చెందిన 18ఏళ్ల యువతి స్నేహితులు. ఆమెను తరచూ వేధిస్తుండేవాడు. శనివారం ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించడంతోపాటు గోరాయ్ బీచ్ లో సుముద్రంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. విషమ పరిస్థితుల్లో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ముఖంపై 10 శాతం కాలిన గాయాలవగా, అంతర్గత గాయాలను వైద్యులు పరీక్షిస్తున్నారు. నిందితుడు జితేంద్ర సక్పాల్ ను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News