: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై అత్యాచారయత్నం
ఐటీ కంపెనీలకు కేంద్రమైన హైటెక్ సిటీ (మాదాపూర్) ప్రాంతంలో మహిళల భద్రతపై మరోసారి సందేహాలు తలెత్తాయి. శనివారం రాత్రి ట్యాక్సీ డ్రైవర్లు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అపహరించడంతోపాటు అత్యాచారయత్నం చేయడంతో అక్కడి భద్రత డొల్లేనని తెలుస్తోంది. గుంటూరుకు చెందిన ఒక యువతి హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది.
శుక్రవారం రాత్రి 8 తర్వాత గౌలిదొడ్డిలోని హాస్టల్ కు నడుచుకుంటూ వెళుతుండగా ట్యాక్సీ వచ్చి ఆగింది. ఆమెను ఎక్కడికి వెళ్లాలని అడుగుతూనే ఇద్దరు కిందకు దిగి కత్తితో బెదిరించి కారులో బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అత్యాచారం చేయాలని ప్రయత్నించగా.. ఆమె పెద్దగా అరుపులు ప్రారంభించడంతో.. తిరిగి గౌలిదొడ్డి ప్రాంతంలో ఆమెను వదిలేసి వెళ్లారు. యువతి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో దర్యాప్తు ప్రారంభమైంది. సీసీటీవీ కెమేరాల ద్వారా నిందితుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.