: ఎలుగు దాడిలో గిరిజనుడు మృతి
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి ఒక గిరిజనుడిపై దాడి చేసింది. దద్దనాల గిరిజన గూడేనికి చెందిన నాగన్న భార్య హనుమక్కతో కలిసి పొలానికి వెళ్లగా ఎలుగు దాడిచేసి తీవ్రంగా గాయపరచింది. అతడిని కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. హనుమక్క ప్రమాదం నుంచి బయటపడింది.