: తుపాను బాధిత ప్రాంతాలలో ఏరియల్ సర్వేకు సీఎం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తుపాను బాధిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరి వెళ్లారు. విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ లో నేరుగా శ్రీకాకుళం జిల్లా డొంకుర్రు గ్రామానికి చేరుకుంటారు. అక్కడి గ్రామస్థులతో మాట్లాడిన అనంతరం దేవుడి గుడి వద్దకు వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుంటారు. అక్కడినుంచి ఇచ్చాపురం వెళతారు. ఆ తరువాత మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం వచ్చి హైదరాబాద్ కు బయలుదేరతారు.