: సీపీఎం నేత యలమంచిలి రాధాకృష్ణ మూర్తి కన్నుమూత
సీపీఎం నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ మూర్తి(85) నిన్న రాత్రి 10 గంటల సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నెల 10న అస్వస్థతకు గురైన ఆయన్ను హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పట్నుంచి కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 1991లో ఆయన గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు.