: ఆరోగ్యానికి తోడుండే నువ్వులు


నువ్వులలోని సుగుణాలు చాలామందికి తెలియదు. కానీ వాటిలో ఉండే పోషకాలను గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా నువ్వులను తమ వంటకాల్లో భాగం చేసేసుకుంటారు. అంత మంచి లక్షణాలను నువ్వులు కలిగివున్నాయి. మన ఆరోగ్యానికి నువ్వులు ఎంతగానో మేలుచేస్తాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు నువ్వులను తీసుకుంటే చక్కగా రక్తవృద్ధి అవుతుంది. ఎలాగంటే నువ్వుల్లో ముఖ్యంగా నల్ల నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తహీనత ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు నల్లనువ్వులను తీసుకుంటే చాలామంచిది.

నువ్వుల్లో మాంసకృత్తులు, అమినోయాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా నువ్వుల్లో పెసమాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్ధం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే నువ్వులను ఎక్కువగా తీసుకోవడం, నువ్వుల నూనెను వాడడం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. నువ్వుల్లో ఉండే పీచుపదార్ధం జీర్ణక్రియను క్రమబద్ధం చేసి, మలబద్దకాన్ని నివారిస్తుంది, పీచు పదార్ధం సమృద్ధిగా ఉండడం వల్ల రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నువ్వుల్లో ఉండే జింక్‌, క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి. కాబట్టి ఆస్టియో పోరోసిస్‌ ప్రమాదం నుండి తప్పించడానికి చక్కగా నువ్వులను తీసుకోవడం మంచిది.

  • Loading...

More Telugu News