: ఈ టోపీ ఆపదల్లో ఆదుకుంటుంది!
అదేంటి టోపీ ఎండలో వెళ్లేటప్పుడు మనకు ఎండనుండి రక్షణ కోస మనం పెట్టుకుంటాం... మరి ఆపదల్లో ఎలా ఆదుకుంటుంది అనుకుంటున్నారా... ఇదో వెరైటీ టోపీ. కాబట్టే ఆపదల్లో ఆదుకుంటుంది అని చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూచినా మహిళలపై లైంగికపరమైన దాడులు పెరిగిపోతున్న నేపధ్యంలో మహిళలు తమవద్ద పెప్పర్ స్ప్రే, చిన్న చాకు, కారంపొడి వంటివాటిని ఉంచుకోవడంతోబాటు ఈ టోపీని కూడా ఉంచుకుంటే మంచిది. ఎందుకంటే ఈ టోపీ పేరే స్లాప్ టోపీ. ఇలాంటిది అవసరాల్లో ఆగంతకులను కొట్టడానికి ఉపకరిస్తుందట.
ఎవరైనా అపరిచితులు, ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దీంతో కొడితే సరి. టోపీతో కొడితే ఏం దెబ్బ తగులుతుంది అనుకుంటున్నారా... ఇది మామూలు టోపీ కాదని ముందే చెప్పుకున్నాంగా. ఇది చూడడానికి టోపీలాగా ఉన్నా ఇందులో వందశాతం లెడ్ కలిగిన పదార్ధం ఉంటుంది. కాబట్టి దీంతో కొడితే దెబ్బ గట్టిగానే తగులుతుంది. అలాగని తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది అనుకుంటున్నారా... అలాఏమీ ఉండదు. ఇది బీన్ బ్యాగ్‌లాగా అనిపిస్తుంది. తలపై తేలికగా ఉంటూ అవసరాలకు పనికొచ్చే ఈ టోపీని చక్కగా బయటికి వెళ్లేప్పుడు పెట్టుకువెళ్లవచ్చు. అత్యవసరాల్లోనూ వాడుకోవచ్చు.