: సమైక్య వాదం ముసుగులో సీఎం రాష్ట్రాన్ని విభజిస్తున్నారు: యరపతినేని
సమైక్యవాదం ముసుగులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన లాంఛనాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అతనికి మిగిలిన నేతలు సహకరిస్తున్నారని గుంటూరు జిల్లా గురజాల శాసనసభ సభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనను కోరింది టీఆర్ఎస్ కంటే వైఎస్సారేనని ఆ విషయాన్ని విస్మరించిన వైఎస్సార్ సీపీ సమైక్యం పేరిట ప్రజలను వంచించాలని చూస్తోందని మండిపడ్డారు.