: ఢిల్లీ ముట్టడికి భారీగా తరలిరండి: విశాలాంధ్ర మహాసభ
విశాలాంధ్ర మహాసభ చేపట్టనున్న ఢిల్లీ ముట్టడి కార్యక్రమానికి కర్నూలు జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలి రావాలని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో మహాసభ ప్రతినిధులు మాట్లాడుతూ సమైక్యవాదులు బస్సుల్లో ఢిల్లీకి వెళ్లడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా చాటే అవకాశం ఉందని వివరించారు.