: హిందాల్కో కేటాయింపుల్లో అవకతవకలు లేవు: పీఎంవో


బొగ్గు గనుల కేటాయింపులపై ప్రధాని కేంద్ర బిందువుగా తీవ్ర విమర్శలు రావడంతో ప్రధాని కార్యాలయం(పీఎంవో) మౌనం వీడింది. హిందాల్కో కంపెనీ గనుల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పీఎంఓ వివరణ ఇచ్చింది. కేటాయింపులకు సంబంధించి తన ముందుంచిన ఫైళ్లను పరిశీలించి అర్హతను బట్టే ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదించారని స్పష్టం చేసింది. 2005లో బొగ్గు మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనలను ప్రధాని సాధికారిక అధికారంతో ఆమోదించినట్టు వివరించింది.

  • Loading...

More Telugu News