: కొంపముంచిన నోట్ల కట్టల పా(న్పు)ము!
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. ఆ మార్క్సిస్టు నేతను చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. త్రిపురలోని అగర్తలాలో మార్క్సిస్టు పార్టీ నేత సమర్ ఆచార్జీ తను సంపాదించిన 20 లక్షల రూపాయలను బ్యాంకునుంచి తెప్పించుకుని, మంచంపై నోట్ల కట్టలను వేసుకుని వాటిపై హాయిగా పడుకున్నాడు. అంతటితో ఊరుకోకుండా వీడియో కూడా తీయించుకున్నాడు. అలా ఎందుకని అడిగితే, బాగా డబ్బున్నప్పటికీ, ఏమీ లేనివాళ్లమని పైకి నటించే ఇతర నాయకుల్లా తాను వంచకుడను కానని, అందుకే సంపాదించిన డబ్బును తెచ్చుకుని, నోట్లను తన పాన్పుపై వేసుకుని హాయిగా నిద్రపోతున్నాననీ చెప్పాడు. అయితే, ఇప్పుడీ ఎపిసోడు ఆయన పీకల మీదకు తెచ్చింది. సరదాగా మొబైల్ ఫోనుతో తీసుకున్న ఈయన గారి నోట్ల కట్టల మధ్య 'నిద్రా భంగిమ'ను ఆయన స్నేహితుడు లీక్ చేయడంతో టీవీ చానెల్స్ ప్రసారం చేసేశాయి. దీంతో పార్టీపరంగా ఆయన మీద చర్యలు తీసుకోవడానికి మార్క్సిస్టు నేతలు సిద్ధమవుతున్నారు.