: కెప్టెన్ ఇన్నింగ్స్ తో శతక్కొట్టిన ధోనీ.. భారత్ 303/9


కెప్టెన్ ఇన్నింగ్స్ తో మహేంద్ర సింగ్ ధోనీ శతక్కొట్టాడు. నిలకడైన ఆటతీరుతో సెంచరీ చేసిన ధోనీ భారత్ ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించాడు. 154 పరుగులకే టాపార్డర్ మొత్తం కుప్పకూలిన దశలో టైయిలెండర్ల సహాయంతో టీమిండియాకు భారీ స్కోరు 303/9 సాధించిపెట్టాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బౌలర్లు విరామం లేకుండా వికెట్లు తీస్తున్న పిచ్ పై ధోనీ మొక్కవోని పట్టుదలతో ఆడి సెంచరీ సాధించాడు.

ధోనీ(139 )కి అండగా అశ్విన్(28), భువనేశ్వర్(10) లు చక్కని సహకారమందించారు. అంతకు ముందు అర్ధ సెంచరీతో కోహ్లీ(68) భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా, చక్కని బంతితో మ్యాక్స్ వెల్ అతనిని బలిగొన్నాడు. అనంతరం కాస్త జాగ్రత్తగా ఆడిన ధోనీ చివర్లో వీరవిహారం చేయడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు సాధించి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్నే ఉంచింది. ఆసీస్ బౌలర్లలో జాన్సన్ నాలుగు వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా విజయలక్ష్యం 304 పరుగులు.

  • Loading...

More Telugu News