: స్వల్పంగా పెరిగిన బంగారం ధర
మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. రూ.150 పెరిగి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.31,650కు చేరింది. త్వరలో పండగలు, పెళ్లిళ్ల సీజన్ రానున్న నేపథ్యంలో బంగారం ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరోపక్క వెండి ధర స్వల్పంగా తగ్గింది. రూ.300 తగ్గిన కేజీ వెండి రూ.48,500 ధరను నమోదుచేసింది.