: కుప్పకూలిన టాప్ ఆర్డర్.. భారత్ 154/6
మూడో వన్డేలో భారత బ్యాటింగ్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ అప్పగించి ఆది నుంచీ భారత్ ను చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో కట్టడి చేసింది. దీంతో కేవలం 31 ఓవర్లకే టాపార్డర్ 6 వికెట్లు కోల్పోయిన బారత జట్టు 154 పరుగులు చేసింది. వైస్ కెప్టన్ కోహ్లీ(68), కెప్టన్ ధోనీ(39) కాస్త ఫర్వాలేదనిపించడంతో ఆమాత్రం స్కోరు సాధించగలిగింది. చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసిన జాన్సన్ మూడు వికెట్లు తీయగా అతనికి వాట్సన్, మెక్ కే, మాక్స్ వెల్ లు చక్కని సహకారమందించారు. క్రీజులో ధోనీ(39) అశ్విన్(2) ఉన్నారు.