: తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం: కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. ఈరోజు మహిళా చైతన్యంపై ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్.. ప్రభుత్వం ఉద్యోగులను వెట్టి చాకిరీ చేసే వారిగానే పరిగణిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, జాతి నిర్మాణ ప్రక్రియలో మహిళలనూ భాగస్వాములను చేయాలని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆది నుంచి మహిళలకు దేశంలో అనాదరణే ఎదురవుతోందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.