: తెలంగాణ ఏర్పాటుకు ఇది సమయం కాదు: హోం శాఖ మాజీ సెక్రటరీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఇది తగిన సమయం కాదని కేంద్ర హాం శాఖ మాజీ సెక్రటరీ గోపాలకృష్ణ పిళ్లై(జీకే పిళ్లై) వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా కోరుకుంటున్నారని అంటూనే, రాష్ట్ర ఏర్పాటుకు ఇది సమయం కాదని అన్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీ సూచన అన్నింటికన్నా అత్యుత్తమమైనదని తెలిపారు. ఆ ప్రయోగం రెండు మూడేళ్లు చూశాక అప్పుడు రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంటే సరిగా ఉండేదని అన్నారు. రాజధాని విషయంలో అవసరానికి మించిన యాగీ జరుగుతోందని, కానీ నీటి సమస్యే జటిలమైనదని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు వల్ల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఊపందుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.