: గాయకుడు అద్నాన్ సమీకి ఆదాయ పన్ను నోటీసులు
పన్ను ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలో పాకిస్థానీ గాయకుడు అద్నాన్ సమీకి ఆదాయపన్ను అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఆయన నిర్వహించిన కార్యక్రమాలపై పన్ను చెల్లించకపోవడంతో అద్నాన్ పై ఈనెల 15న కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వీసా గడువు ముగిసినా కూడా భారత్ లో ఉంటున్నారన్న వివాదంలో అద్నాన్ నిన్ననే మూడు నెలల గడువు పొందిన సంగతి తెలిసిందే.