: కృష్ణా, గోదావరిని ఎవరూ ఎత్తుకుపోరు : జైపాల్ రెడ్డి
మానవజాతి పుట్టక ముందే కృష్ణా, గోదావరి నదులు పుట్టాయని... వాటిని ఎవరూ ఎత్తుకుపోలేరని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. విభజన తర్వాత తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య సద్భావన మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద ఈ రోజు జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారకదినోత్సవానికి జైపాల్ రెడ్డి హాజరయ్యారు.