: ముఖ్యమంత్రి నీటిని అక్రమంగా తరలిస్తున్నారు : సోమిరెడ్డి


కండలేరు జలాశయం డెడ్ స్టోరేజ్ నుంచి 6 టీఎంసీల నీటిని సీఎం కిరణ్ అక్రమ మార్గంలో తరలిస్తున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 6 వేల కోట్లతో నీటిని తరలిస్తూ నెల్లూరు జిల్లా వాసులకు ఆయన తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కండలేరు ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే పైప్ లైన్ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News