: హైదరాబాద్ ను మూడేళ్లే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరాం: కోదండరాం


తెలంగాణపై కేంద్రమంత్రుల బృందానికి సమర్పించిన నివేదికలోని విషయాలను టీ జేఏసీ ఛైర్మన్ కోదండరాం వెల్లడించారు. హైదరాబాద్ ను మూడు సంవత్సరాలే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, అంతకుమించి ఉంచవద్దని కోరినట్లు తెలిపారు. మొత్తం పదకొండు అంశాలపై కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక పంపినట్లు తెలిపిన కోదండరాం సింగరేణిపై ఇప్పుడున్న అధికారాన్ని కొనసాగించాలని చెప్పామన్నారు. ట్రైబ్యునల్స్ తీర్పు ప్రకారమే నీటి పంపిణీ జరగాలని, జీవో 53 ప్రకారం విద్యుత్ కేటాయింపులు జరపాలని, అవసరం మేరకు అదనపు గ్యాస్ కేటాయింపు జరగాలని నివేదికలో వివరించామన్నారు.

  • Loading...

More Telugu News