: సమైక్య సభపై జగన్ సూచనలు
సమైక్య శంఖారావం సభపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో చర్చించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26న ఎల్బీ స్డేడియంలో సమైక్య శంఖారావం సభను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు చేస్తున్న ఏర్పాట్లను జగన్ సమీక్షించారు. సభ సాఫీగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.