: కళ్లను పదిలంగా కాపాడుకోండి


సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అన్నారు పెద్దలు. కంటి చూపే అన్నింటికీ ఆధారం. ఈ లోకంలో మనకంటూ దారి చూపించి నడిపించేవి కళ్లే కదా. అంతటి ప్రాధాన్యం ఉన్న కళ్ల విషయలో మనమేం శ్రద్ధ తీసుకుంటున్నామో? ఒక్కసారి ఆలోచించండి. 

ఆరోగ్య పరీక్ష - 8 
సాధారణంగా ఏదైనా సమస్య వస్తే గానీ వైద్యులు గుర్తుకురారు. మరి అన్ని వ్యాధులూ, సమస్యలూ వెంటనే పైకి కనిపించాలని లేదుగా! అందుకే ఏ సమస్య లేకపోయినా ప్రతీ ఆరు నెలలకోసారి కంటి పరీక్ష కోసం వైద్యులను తప్పకుండా కలవాల్సిందే. ముందస్తు పరీక్షల ద్వారా కొన్ని రకాల సమస్యలను ముందుగానే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దాంతో అవి రాకుండానే జాగ్రత్త పడవచ్చు. అలానే కళ్లకు సంబంధించి మంట, దురద ఇతరత్రా సమస్యలున్నా సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఎందుకంటే సమస్య ఎందుకొచ్చిందో తెలుసుకోకుండా వైద్యం చేయడం శ్రేయస్కరం కాదు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల కంటిచూపును దెబ్బతీసే గ్లూకోమా, రెటీనా సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. అలాగే కేటరాక్ట్, కార్నియాకు సంబంధించి ఇబ్బందులున్నా పరీక్షల్లో బయటపడుతుంది. చూపుకు సంబంధించి సమస్యలున్నా, కళ్లద్దాలు వాడుతున్నా కూడా ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా వైద్యులను కలవాలని మరచిపోకండి. 

  • Loading...

More Telugu News