: సమైక్యాంధ్రకోసం సీఎం గ్రామాల్లో పర్యటిస్తారు: లగడపాటి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా గ్రామాలలో పర్యటిస్తారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఆర్టికల్ 371 డీ సమైక్యాంధ్రకు కవచకుండలమేనని.. దీని ఆధారంగా న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. సమైక్యవాదులంతా కలిస్తే విభజన ప్రక్రియ ముందుకు వెళ్లకుండా ఆపగలుగుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమ్మె విరమణతో సమైక్యాంధ్ర ఉద్యమం ఆగిందనుకుంటే పొరపాటేనన్నారు.