: 42 మంది స్మగ్లర్ల అరెస్టు


చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద ఈ తెల్లవారు జామున అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎర్రచందనం అక్రమరవాణా సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఆకస్మిక దాడులు జరపడంతో లారీలో ఎర్రచందనం దుంగలను నింపుతున్న స్మగ్లర్లు అడ్డంగా దొరికిపోయారు. అటవీ అధికారులను చూసిన 42 మంది స్మగ్లర్లు పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ అప్రమత్తంగా ఉన్న అటవీ శాఖాధికారులు వారిని అరెస్టు చేశారు. వీరితో పాటు లారీ, రెండు కార్లు, 3 ద్విచక్రవాహనాలను, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్లు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లుగా అటవీ శాఖాధికారులు గుర్తించారు. పట్టుబడిన వాహనాలు, ఎర్రచందనం విలువ 50 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News