: రోశయ్యతో బొత్స భేటీ
తమిళనాడు గవర్నర్ రోశయ్యతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విశాఖలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని అన్నారు. విజయనగరంలో నెలకొన్న పరిస్థితులను రోశయ్యకు వివరించారు. తాను జిల్లాలో పర్యటిస్తానని, 21,22,23 తేదీల్లో పైడితల్లమ్మ పండగ ఉందని దాన్ని దృష్టిలో పెట్టుకునే కర్ఫ్యూ ఎత్తివేశారని, అయినప్పటికీ 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లాలో తాజా పరిస్థితిని బొత్స రోశయ్యకు వివరించారు.