: కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ రాజకీయ లబ్ది కోసం పాకులాడుతున్నాయి : బొత్స
విభజన విషయంలో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు రాజకీయ లబ్ది కోసం పాకులాడుతున్నాయని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అయితే విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తున్నామని చెప్పిన బొత్స, రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ ఏ పనీ చేయదన్నారు. విభజనకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాకే కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని... అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా అందరూ మాట మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతకుముందు విశాఖలో మంత్రి గంటాతో బొత్స భేటీ అయ్యారు.