: కాంగ్రెస్ వంద సీట్లు కూడా గెలుచుకోలేదు : వెంకయ్యనాయుడు


అవినీతి కూపంలో చిక్కుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 100 ఎంపీ సీట్లు కూడా రావని భాజపా అగ్రనేత వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులో మోడీకి బ్రహ్మరథం పట్టారని ఆయనన్నారు. రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలపై మరింత దృష్టి పెడతామని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మోడీ గాలి వీస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News