: కేంద్ర మంత్రుల పర్యటనలకు 270 కోట్లు
కేంద్ర మంత్రులు తమ పర్యటనల కోసం ప్రజాధనాన్ని ఎంతగా ఖర్చు పెడుతున్నారో తెలుసా? అక్షరాలా 270 కోట్ల రూపాయలు. అవును మరి 2013-14 ఆర్థిక సంవత్సరంలో మంత్రుల పర్యటనల కోసం ఆర్థిక మంత్రి చిదంబరం 270.05 కోట్లను కేటాయించారు. ప్రస్తుత ఏడాదిలోనూ వీరి పర్యటనల బడ్జెట్ ఇంతే ఉంది.
ఈ నిధులను మంత్రులతోపాటు మాజీ ప్రధాన మంత్రుల పర్యటనలకు వినియోగిస్తారు. హెలికాప్టర్ల నిర్వహణ ఖర్చూ ఇందులో భాగమే. విశేషం ఏమిటంటే, రెండేళ్ల కిందట మన మంత్రులు పర్యటనల కోసం 678 కోట్లు ఖర్చు చేసేవారు. 2011-12 బడ్జెట్ లో ఇందుకు చేసిన కేటాయింపులు 678.53 కోట్లు. ఈ లెక్కన చూస్తే ప్రస్తుత కేటాయింపులే నయమనిపిస్తున్నాయి కదూ... !