: 'గో' అంటూ రానున్న కొత్త కారు
మార్కెట్లోకి కొత్త కార్లు వచ్చేస్తున్నాయి. వాటిలో మనదేశంలో తొలిసారిగా డాట్సన్ కంపెనీ అందిస్తున్న తొలి కారు ఒకటి వచ్చే ఏడాది మన దేశ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ కారు పేరు 'గో'. పేరు భలే వెరైటీగా ఉందికదూ. ఈ కారు కూడా వెరైటీగానే ఉంటుందట. ఐదు సీట్లు, ఐదు డోర్లతో ఉండే ఈ హ్యాచ్‌బాక్‌ను వచ్చే ఏడాది మనదేశంలోకి విడుదల చేయాలని డాట్సన్ కంపెనీ భావిస్తోంది. దీనిలో 1.2 పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వంటి ప్రత్యేకతలను కలిగివుండడంతో ఇది ఇప్పటికే మన దేశ కార్ల మార్కెట్లోని సుజుకి ఏ-స్టార్, హ్యుందాయ్ ఐ10లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
అలాగే డాట్సన్ అందిస్తున్న మరో మోడల్ డాట్సన్ గో ప్లస్ ఎంపీవీ. ఇది ఏడు సీట్ల ఎంపీవీ. ఇద్దరు కూర్చోడానికి వీలుగా మూడో వరుస ఉండడంతోబాటు డాష్‌బోర్డులోనే గేర్ షిఫ్ట్ లివర్‌ను అమర్చడం, స్మార్‌ఫోన్ ఇంటిగ్రేషన్ కోసం మొబైల్ డాకింగ్ స్టేషన్ వంటి ఫీచర్లను ఇది కలిగివుంది. ఈ మోడల్‌ను ఇటీవలే ఇండోనేషియాలో విడుదల చేశారు. వచ్చే ఏడాదికి భారత్‌లోకి వచ్చే అవకాశాలున్నాయి.