: 'రేంజ్ రోవర్' రేటు కోటి పైమాటే
జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ కంపెనీ మార్కెట్లోకి కొత్త స్పోర్ట్ కారును విడుదల చేసింది. ఈ కారు చాలా ఖరీదైంది. ఈ కారు పైకేకాదు, లోపల కూడా చాలా అందంగా ఉంటుందట. ఇంధనం ఆధునిక సాంకేతికతతో కూడినది కావడంతో దీని సామర్ధ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుందని, స్పోర్ట్ యుటిలిటీ విభాగంలో తాము తీసుకొచ్చిన తొలి తేలికైన అల్యూమినియం నిర్మాణం గల వాహనం ఇదేనని జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ కంపెనీ చెబుతోంది. పెట్రోలు, డీజిల్ రకాల్లో రెండింటిలోను లభ్యమయ్యే ఈ కారు రేటు ఐదు లీటర్ల పెట్రోలు ఇంజిన్ రకం ధరం రూ.1.66 కోట్లు, మూడు లీటర్ల డీజిల్ ఇంజిన్ రకం ధరం రూ.1.1కోట్లు.