: ప్రపంచంలోనే అత్యంత చెత్త విమానాశ్రయం ఫిలిప్పీన్స్ దే


ప్రపంచంలోనే అతి చెత్త విమానాశ్రయం ఏది? అనే అంశం మీద ఓ ట్రావెల్ సైట్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అత్యంత చెత్త విమానాశ్రయంగా ఫిలిప్పీన్స్ విమానాశ్రయం వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 'ద గైడ్ టు స్లీపింగ్ ఇన్ ఎయిర్ పోర్ట్' వెబ్ సైట్ చేసిన సర్వేపై ఫిలిప్పీన్స్ విమానాశ్రయాధికారులు మండిపడుతున్నారు. తాము మాత్రం వినియోగదారుల సూచనల మేరకు అన్ని సౌకర్యాలను మెరుగుపరిచామని అంటున్నారు. అయితే, ఇక్కడి సౌకర్యాలు శిధిలావస్థలో ఉన్నాయని, విమానాశ్రయ సిబ్బంది, టాక్సీ డ్రైవర్లు వినియోగదారులకు కనీస మర్యాద కూడా ఇవ్వరని, ఇక్కడ వెయిటింగ్ కూడా చాలా ఎక్కువ అని, అధికారులు చాలా మూర్ఖంగా వ్యవహరిస్తారని ఈ సర్వేలో నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News