: నాయకులకు అహం.. అహంకారం ఉండకూడదు: దామోదర


నాయకులకు అహం కానీ, అహంకారం కానీ ఉండకూడదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరుగుతున్న తెలంగాణ జైత్రయాత్రలో ఆయన మాట్లాడుతూ జై ఆంధ్ర ఉద్యమంలో విభజన కావాలని కోరినవారే ఇప్పుడు సమైక్యమంటూ ఉద్యమిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాయకుడనే వాడు మూడు ప్రాంతాలను ఒకేలా చూసుకోవాలి కానీ, గతంలో రాష్ట్రాన్ని పాలించినవారు పక్షపాతంగా వ్యవహరించారని అన్నారు. ప్రభుత్వానికి నేతృత్వం వహించే వాడికి తెలంగాణకు వ్యతిరేకం అనే భావజాలం ఉండకూడదని హితవు పలికారు. తెలంగాణ ప్రజల ఆవేదన, ఆక్రందనను కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. సిద్దాంతాలకు, ఇచ్చిన మాటకు కట్టుబడ్డ ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని దామోదర రాజనర్శింహ తెలిపారు.

  • Loading...

More Telugu News