: ప్రత్యేక తెలంగాణ అన్నది వైఎస్సే: వీహెచ్


ప్రత్యేక తెలంగాణ అంటూ 41 మంది ఎమ్మెల్యేలను సోనియా వద్దకు పంపించింది వైఎస్సేనని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరుగుతున్న తెలంగాణ జైత్రయాత్ర సభలో మాట్లాడుతూ చంద్రబాబును పడగొట్టాలంటే తెలంగాణ అస్త్రం తప్పదని అన్నారు. లగడపాటి, గాదె లాంటి నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కుంపటి వెలిగించింది తాము కాదని, సీమ నేతలే పెట్టారని సీమాంధ్ర ప్రజలు గుర్తించాలని సూచించారు. తెలంగాణ తన చేతిలో లేదని గతంలో ముఖ్యమంత్రి చాలాసార్లు అన్నారని ఆయన గుర్తు చేశారు. తండ్రి శవం ప్రక్కన ఉండగానే సీఎం కుర్చీ కోసం జగన్ సంతకాలు తీసుకున్నప్పుడే జగన్ వైఖరిని సోనియా గుర్తించారని వీహెచ్ తెలిపారు.

  • Loading...

More Telugu News