: తీవ్రవాద అణచివేత బలగాలను ఏర్పాటు చేస్తాం: నవాజ్ షరీఫ్


తీవ్రవాదులను, హంతకులను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరముందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. ఈ రోజు లాహోర్ లో శాంతిభద్రతలకు సంబంధించిన ఒక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదాన్ని అణచివేయడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఇందులో భాగంగా, తీవ్రవాద అణచివేత బలగాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ బలగాల్లో చేరిన వారికి కమెండో తరహా శిక్షణ ఉంటుందని షరీఫ్ తెలిపారు.

  • Loading...

More Telugu News