: ఇమ్రాన్ ఖాన్ ఓ పిరికి పంద: బిలావల్ భుట్టో
మాజీ క్రికెటర్, రాజకీయ వేత్త ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో మండిపడ్డారు. కరాచీలో ఆయన తల్లి బేనజీర్ భుట్టో వర్ధంతి సభలో మాట్లాడుతూ.. 'ఇమ్రాన్ ఓ పిరికి పంద' అని అభివర్ణించారు. ఉగ్రవాదులకు ఇమ్రాన్ అండగా నిలవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రికే ఇన్సాఫ్ లా తమ పార్టీ పిరికిది కాదని అన్నారు. సెప్టెంబర్ 21న పెషావర్ లో చర్చిముందు నిలుచున్న ప్రజల మరణానికి కారణమైన ఉగ్రవాదులకు ఇమ్రాన్ అనుకూలంగా మాట్లాడడాన్ని బిలావల్ ఖండించారు. ఉగ్రవాదులకు పీపీపీ పార్టీ భయపడదని, వారికి ఎదురొడ్డి పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. 2007లో జరిగిన ఉగ్రవాద దాడిలో బిలావల్ తల్లి బేనజీర్ భుట్టోతో పాటు మరో 140 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.