: కేంద్రం కోరితేనే అసెంబ్లీని సమావేశపరుస్తాం: సీఎం కిరణ్


ముందుగా అసెంబ్లీని సమావేశపరచడం సాధ్యం కాదని, కేంద్రం కోరితేనే శాసనసభను సమావేశపరుస్తామని సీఎం కిరణ్ స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో తనను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో ఆయన ఈ మేరకు చెప్పారు. అసెంబ్లీని సమావేశపరిస్తే సమైక్యానికి ఎంతమంది మద్దతిస్తున్నారో తెలిసిపోతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సీఎంతో అన్నారు. అయితే, సీఎం వారి విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ శాసనసభ్యులు సచివాలయం సీ బ్లాక్ ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో, పోలీసులు ఆ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

  • Loading...

More Telugu News